సైన్స్‌ మంత్రం..సృజన తంత్రం | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ మంత్రం..సృజన తంత్రం

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

కడప ఎడ్యుకేషన్‌,: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్‌ శాస్త్ర సాంకేతిక మండలి, భారతీయ విజ్ఞాన మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ’కౌశల్‌ సైన్స్‌ క్విజ్‌ – 2026’ పోటీలకు సన్నద్ధమౌతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లల్లో సైన్స్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. ఆసక్తి గల విద్యార్థుల వివరాలను పాఠశాల కోఆర్డినేటర్లు ఈ నెల 20వ తేదీ లోపు జ్చుఠటజ్చి. ఛఠిఝ్చఞ. ౌటజ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

పోటీల షెడ్యూల్‌ ఇలా...

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు ప్రతి పాఠశాల నుండి ఒక్కో తరగతికి 10 మంది చొప్పున గరిష్టంగా 30 మంది విద్యార్థులను ఎంపిక చేయాలి. గణితం, విజ్ఞానశాస్త్రం, భూగోళశాస్త్రం/భారత దర్శనం, విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి అనే అంశాలపై పోటీలు ఉంటాయి. పాఠశాల స్థాయి ఆన్‌లైన్‌ క్విజ్‌: అక్టోబర్‌ 28న 8వ తరగతి, అక్టోబర్‌ 29న 9వ తరగతి, అక్టోబర్‌ 30న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.

జిల్లా స్థాయి ప్రత్యక్ష పరీక్షలు: నవంబర్‌ 25

రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష: డిసెంబర్‌ 30

ప్రత్యేక అంశాలపై పోస్టర్‌, రీల్స్‌ పోటీలు:

జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు నవంబర్‌ 25న జరిగే ప్రత్యక్ష పోటీలలో కింది అంశాలపై పోటీలు ఉంటాయి. 8వ తరగతి విద్యార్థులకు ’హరిత ఇంధన వనరులు – సుస్థిర భవిష్యత్తు’, 9వ తరగతి విద్యార్థులకు ’బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు – నైతికత’ అనే అంశాలపై పోస్టర్‌ ప్రెజెంటేషన్‌ పోటీ ఉంటుంది. అలాగే 10వ తరగతి విద్యార్థులకు ’డా. యల్లాప్రగడ సుబ్బారావు జీవితం – పరిశోధనలు’ అనే అంశంపై రీల్స్‌ పోటీ ఉంటుంది.

ఆకర్షణీయమైన నగదు బహుమతులు:

క్విజ్‌ విభాగం (టీమ్‌): జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ రూ.4,500, తృతీయ రూ.3,000 చొప్పున అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ రూ.15,000, ద్వితీయ రూ.12,000, తృతీయ రూ.9,000 ఇస్తారు.

పోస్టర్‌, రీల్స్‌ విభాగం (వ్యక్తిగత): జిల్లా స్థాయిలో ప్రథమ రూ.2,000, ద్వితీయ రూ.1,500, తృతీయ రూ.1,000 ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ రూ.5,000, ద్వితీయ రూ.4,000, తృతీయ రూ.3,000 తో పాటు మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేస్తారు.

విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచేందుకు కౌశల్‌ సైన్స్‌ క్విజ్‌ పోటీలు

8,9,10 చదివే ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement