బద్వేల్ మున్సిపాలిటీ ఓసీ జనరల్‌కు ఖరారైంది. మున్సిపల్ చైర్మన్‌గా రితేష్‌రెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఉన్నట్లు సమాచారం. విజయమ్మ ఆలోచనలను పసిగట్టిన ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి తన కుమార్తెను పోటీ చేస్తారని ప్రచారం మొదలు పెట్టినట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా టీడీపీ కోసం అంకితభావంతో పనిచేసిన తమ కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ సీటు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు దీపక్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఇన్‌ఛార్జిగా పార్టీ బలోపేతం చేయాలనుకుంటే తన కుటుంబానికే మున్సిపల్ చైర్మన్ స్థానం కట్టబెట్టాలని సూర్యనారాయణరెడ్డి వాదిస్తున్నట్లు తెలుస్తోంది.


