సీటు కోసం సిగపట్లు! | - | Sakshi
Sakshi News home page

సీటు కోసం సిగపట్లు!

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మొన్నటివరకు తమకు అనుకూలమైన ‘రిజర్వేషన్‌’ కోసం వ్యూహాల్లో మునిగి తేలిన పచ్చ నేతలు తాజాగా ‘సీటు’ కోసం కోటరీ కడుతున్నారు. ఒకరి అంతం కోసం మరొకరు పంతం పడుతున్నారు.. జిల్లా వ్యాప్తంగా ‘కూటమి’ ముంగిట కుంపట్లు రాజేసుకున్నాయి.

సాక్షి ప్రతినిధి, కడప : మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయిన నేపథ్యంలో పచ్చ పార్టీ నేతలు సీటు పోరులో మునిగి తేలుతున్నారు. తమ వ్యతిరేక వర్గానికి చెందిన వారికి పార్టీ టికెట్‌ దక్కకూడదనే దిశగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా, స్థానికంగా ‘మేము చెప్పిందే వేదం’ అన్నట్లుగా కూటమి ఎమ్మెల్యేల శైలి కన్పిస్తోంది. వెరసి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక ప్రతిష్టంభనగా మారింది. కడప మేయర్‌ అభ్యర్థిత్వం కోసం ఇరు వర్గాలు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని ఒకరు, కాదు, కాదు మాకే అవకాశం దక్కనుందని వారి వారి అనుచరులు హోరెత్తిస్తున్నారు.

మున్సిపల్‌ హీట్‌

పచ్చపార్టీలో పతాక స్థాయిలో వర్గ విభేదాలు

ఉమాదేవి కుటుంబంపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్యే మాధవి వర్గీయులు

దేవగుడి ఫ్యామిలీలో ‘చైర్మన్‌’ కోసం ‘నువ్వా–నేనా’ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement