‘స్థానిక’ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీఅంజద్‌బాషా కోరారు. మంగళవారం వారు ఎస్పీ నచికేత్‌విశ్వనాథ్‌ను కలిసి జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలతోపాటు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత కల్పించాలని కోరామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, రైతు లను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయకపోగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీడీపీకి లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌కుమార్‌, వైసీపీ నేతలు జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్‌, షఫీ, ఇబ్రహీం మియా, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి వైఎస్సార్‌ సీపీ నేతల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement