మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైఎస్‌ ప్రమీలమ్మ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైఎస్‌ ప్రమీలమ్మ

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● భారీ మెజార్టీతో గెలిపించండి

● వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ మదనమోహన్‌రెడ్డి

పులివెందుల టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైఎస్‌ ప్రమీలమ్మను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున ప్రకటించారని వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్‌ మధురెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని వైఎస్‌ మనోహర్‌రెడ్డి నివాసంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ ప్రమీలమ్మను మున్సిపల్‌ చైర్మన్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే 40 వార్డులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కూటమి నాయకులు, అరాచకాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోందని, వారి దాడులకు ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందన్నారు. 2014లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా వైఎస్‌ ప్రమీలమ్మ కొనసాగారన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చారన్నారు. మళ్లీ ఆమెను మున్సిపల్‌ చైర్మన్‌గా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం వైఎస్‌ ప్రమీలమ్మ మాట్లాడుతూ రెండోసారి తనను చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పులివెందుల మున్సిపాలిటీని కానుకగా ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మ న్‌ వరప్రసాద్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ హఫీజ్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు కిశోర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రసూల్‌, కోడి రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement