వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలం

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

● ప్రొద్దుటూరులో వైభవంగా

శరన్నవరాత్రి ఉత్సవాలు

● మైసూరును తలపించిన

ఆధ్యాత్మిక శోభ

● కనులపండువగా కలశాల ఊరేగింపు,

సాంస్కృతిక ప్రదర్శనలు

● కాలుపెడితే కదలలేని స్థితి..

● రైలు బోగీల్లో ప్రయాణికులకు ఇక్కట్లు

మంగళవాయిద్యాల మోతలు, వేదమంత్రాల ఘోషలు, సువాసినుల గోవిందనామాల నడుమ రెండో మైసూరుగా ప్రసిద్ధి చెందిన పుత్తడిపురం ఆధ్యాత్మిక సాగరమైంది. జగన్మాతను కొలిచే పవిత్ర శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం భక్తిప్రపత్తుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకపావని అయిన ఆ పరాశక్తిని వేడుకుంటూ భక్తులు ఆలపించిన ‘పాహిమాం పరమేశ్వరి’ నామస్మరణతో పురవీధులు పులకించిపోయాయి. దేవీ నవరాత్రుల కలశస్థాపన పూజలతో పట్టణమంతటా భక్తిభావం ఉప్పొంగింది.

ప్రొద్దుటూరు కల్చరల్‌ : పుత్తడిపురం ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల దసరా ఉత్సవ కమిటీల వారు దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య సువాసినులు అగస్త్యేశ్వర స్వామి ఆలయం నుంచి కలశాలలో నింపిన నవగంగ తీర్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి వాసవీమాతకు అభిషేకం చేశారు. కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపుగా బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి చినవీరయ్య శెట్టి రచించిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి పురాణాన్ని తీసుకురావడంతో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో కర్ణాటక కళాకారుల చిలిపిలి బొమ్మలు, మహిళల కోలాటం, నృత్యప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, పాలకొల్లు బ్యాండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌ రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు సభ్యులు సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా బందోబస్తు నిర్వహించారు.

నృత్యం చేస్తున్న కళాకారులు

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం 12వ డివిజన్‌ దేవునికడపలో ఆ డివిజన్‌ ఇన్‌చార్జి నాగమణి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు మాజీ డిప్యూటీసీఎం అంజద్‌బాష, సీఈసీ సభ్యులు కె.సు రేష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వారధిగా నిలవాలని, స్థానిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కడపలోని 66 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందనే ధీమాను నాయకులు వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలకు కండువాలు వేసి ఆహ్వానించారు. మాజీ మేయర్‌ పాకా సురేష్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానంద రెడ్డి, సీనియర్‌ నాయకులు రాజశేఖర్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్‌, బంగారు నాగయ్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌,షఫీ, కిరణ్‌, త్యాగరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ , మరియలు పాల్గొన్నారు.

శ్రీ లలితాదేవి, రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సుహాసినులు గోవిందనామాలు, విష్ణుసహస్రనామ పారాయణం చేస్తూ అగస్త్యేశ్వరాలయానికి చేరుకుని గంగాజలంతో నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి పూజాకార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీ మహాలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి ఆలయ ఉత్సవ కమిటీ వారు ఊరేగింపుగా పాత బస్టాండ్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేసి కలశాన్ని తీసుకెళ్లారు.

స్థానిక శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రాజీవ్‌సర్కిల్‌లోని శివాలయంలో పూజలు చేశారు. శాసీ్త్రనగర్‌లోని రాజరాజేశ్వరిదేవి ఆలయం, సత్యనారాయణస్వామి ఆలయం, చౌడేశ్వరీదేవి ఆలయాల నిర్వాహకులు కలశపూజ వైభవంగా నిర్వహించారు.

శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, రమాదేవి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యౖవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు రాచమల్లు దంపతులకు అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ వరికూటి ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement