బీసీలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే | - | Sakshi
Sakshi News home page

బీసీలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

బీసీలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే బీసీలను అణగదొక్కింది చంద్రబాబే డమ్మీ జీవోలు ఇచ్చి మభ్యపెట్టాలని చూశారు

స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే 34 శాతం రిజేర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి రిజర్వేషన్లు సాధించే మార్గాన్ని వదిలేసి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ చంద్రబాబు దొంగ జీవోలు ఇచ్చి మళ్లీ హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించడం హాస్యాస్పదం. దీన్నిబట్టి బీసీలకు రిజర్వేషన్లు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిసిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.

– ఎస్‌. యానాదయ్య, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు

ఈ రెండున్నరేళ్లలో బీసీలను అన్ని విధాలుగా అణిచివేశారు. కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ఏ ఒక్క బీసీకి మంచి పదవులు ఇవ్వలేదు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీల గణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు రిజర్వేషన్లపై వేసిన డెడికేషన్‌ కమిటీ 8 నెలలైనా నివేదిక ఇవ్వలేదు. దాని గడువు కూడా పొడిగించారు. వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. బీసీలు కూటమి మోసపూరిత వైఖరిని గుర్తించాలి. – ఎస్‌. బసవరాజు,

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం.

బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చెల్లవు. రాజ్యాంగ సవరణ కూడా చేయలేరు. చంద్రబాబుకు బాగా తెలిసే ఈ డ్రామా ఆడారు. డమ్మీ లాయర్లను పెట్టి డమ్మీ వాదనలు వినిపించి మమ అనిపించారు. స్థానిక ఎన్నికల్లో ఇస్తామని చెప్పడం కాదు...నామినేషన్లు వేసి, స్క్రూట్నీ అయిన తర్వాత ఎంతశాతం బీసీలకు ఇచ్చారో ప్రకటించే చిత్తశుద్ధి ఉందా....దీన్ని బట్టి చంద్రబాబు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం లేదని అర్థమవుతుంది.

– మల్లికార్జున, మాజీ కార్పొరేటర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement