దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

ప్రొద్దుటూరు కల్చరల్‌ : శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను నిత్య నూతనంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాం మోహన్‌రావు తెలిపారు. అమ్మవారిశాలలో శుక్రవారం దసరా ఉత్సవాల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 136వ దసరా ఉత్సవాలను ఆర్యవైశ్యసభ సహకారంతో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ ఏడాది అమ్మవారి అలంకారాలు భక్తులకు కన్నులవిందు చేస్తాయన్నారు. త్రీడీ డెకరేషన్‌ ,పాలకొల్లు బ్యాండ్‌, కర్ణాటక చిలిపిలి బొమ్మలు, నృత్య తరంగణి వారి ఫిన్‌ఆర్ట్స్‌ వారి ప్రోగ్రాం, డ్రమ్స్‌, సినీ డూప్స్‌, రేలా రే రేలా ప్రోగ్రాం, డ్రోన్‌ ద్వారా పుష్పార్చన తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ఆద్యంతం ఘనంగా జరగనున్నాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి అమ్మవారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు దసరా వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సమావేశంలో ఆర్యవైశ్యసభ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మల్లెంకొండు ప్రతాప్‌, కార్యవర్గ సభ్యులు నాగరాజ శ్రేష్టి, బాలరాజు, జగన్‌మోహన్‌, వెంకటేశ్వర్లు, మురళీధర్‌, చంద్రమోహన్‌రావు, ఉదయ్‌కుమార్‌, పవన్‌కుమార్‌, సత్యనారాయణ, ఆర్యవైశ్యసభ, దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement