● బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా నిరూపించారు.. | - | Sakshi
Sakshi News home page

● బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా నిరూపించారు..

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

● బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా నిరూపించారు.. ● బ్యాక్‌బోన్‌ విరిచారు..

పేద ప్రజల జీవనాన్ని దగ్గరగా పరిశీలించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే, వారి ఉన్నతి లక్ష్యంగా అడుగులు వేశారు. ఐదేళ్ల పాలనలో రాజకీయంగా, సామాజికపరంగా అగ్రపీఠం వేశారు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే బీసీల ఆత్మబంధువుగా మారారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని నిరూపించారు. 143 కులాలున్న బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. క్షేత్రస్థాయిలో సైతం అదేబాటలో అధికారం అప్పగించారు. స్థానిక సంస్థల్లో ఓసీలకు రిజర్వుడు స్థానాల్లో సైతం బీసీ అభ్యర్థులకు కేటాయించిన చరిత్ర సైతం వైఎస్సార్‌సీపీకే దక్కిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

టీడీపీకి బడుగు బలహీన వర్గాల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి ఉన్నతిపై లేదని, బీసీలు ఆర్థిక, సామాజిక ఉన్నతికి కృషి చేసిన దాఖలాలు బాబు రాజకీయ జీవితంలోనే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీసీల జపం చేయడం, ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు సర్కార్‌ జీఓ 105, 1065 జారీ చేసిందని పలువురు వివరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీల తిరుగుబాటు తప్పదని భావించే కూటమి సర్కార్‌ బీసీ రిజర్వేషన్లు నాటకం ఆడారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. హైకోర్టు తిరస్కరించిన తర్వాత రక్తి కట్టించేందుకు సుప్రీంకు వెళ్లినట్లు మరో డ్రామా కు తెరలేపారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామం ఉత్తి మాటలేనని, ఆదరణ పేరుతో పనిముట్లు పంపిణీ చేసి కులవృత్తులకే పరిమితం చేయాలనేది సీఎం చంద్రబాబు ప్రధాన ఉద్దేశమని పలువురు మండిపడుతున్నారు

బడుగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమంలో అగ్రపీఠం కల్పిస్తేనే సామాజిక న్యాయం దక్కుతుందని వైఎస్సార్‌సీపీ విశ్వసిస్తే.. బీసీల పేరుతో కొంగ జపం చేస్తూ ఓట్లు–సీట్లు పొందడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కుట్రలు..కుయుక్తులు పన్నుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement