స్థానిక ఎన్నికలకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పటిష్ట చర్యలు

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

– కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయప్రవీణ్‌

రాజంపేట: స్థానికసంస్థల ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసుశాఖ ముందస్తుగానే చర్యలు చేపట్టిందని కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయప్రవీణ్‌ అన్నారు. శుక్రవారం తిరుపతికి వెళుతూ మార్గంమధ్యలో స్థానికరోడ్లు భవనాల అతిథిగృహంలో బసచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత సార్వత్రిక, స్థానికసంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎన్నికల్లో హింసకు ప్రేరిపించిన వారిని, బలహీనవర్గాలకు చెందిన ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన వారితోపాటు కేసులు ఉన్న వారిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. డీఐజీ వెంట పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కాగా డీఐజీని రాజంపేట మున్సిపాలిటి టీడీపీ నేతలు రాజంపేట ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలిసి సత్కరించడం గమనార్హం.

సీఐ చల్లనిదొరకు పదోన్నతి

కడప అర్బన్‌: కడప రూరల్‌ సీఐ చల్లని దొరకుడీఎస్పీగా పదోన్న తి లభించింది. కొన్నేళ్లుగా సీఐగా పనిచేస్తున్న ఆయన్ను డీఎస్పీగా పదో న్నతిని కల్పిస్తూ ఉత్తర్వు లు జారీ ఆయ్యాయి. ఈమేరకు తక్షణమే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్‌ చేసుకోవాలని కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ ఉత్వర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement