– ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పులివెందుల్లోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామాలాడుతున్నాడన్నారు. రిజర్వేషన్లు 50శాతం పరిమితి దాటకూడదని తెలిసినా కూడా బీసీ రిజర్వేషన్ అంటూ వారిని మభ్యపెట్టేందుకు కొత్తరకం మోసాన్ని తెరపైకి తెచ్చాడని మండిపడ్డారు. బీసీలకు సముచిత స్థానం కల్పించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగనన్న మాత్రమేనన్నారు. బీసీల కోసం 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని బీసీలందరూ చంద్రబాబు చేసిన మోసాన్ని గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.


