కడపలో టీడీపీకి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

కడపలో టీడీపీకి షాక్‌

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

● వైఎస్సార్‌సీపీలోకి

1500 కుటుంబాల చేరిక

● ఆహ్వానించిన పార్టీ నేతలు

కడప కార్పొరేషన్‌: కడప నగరంలోని 2వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ డివిజన్‌లోని వైఎస్సార్‌ కాలనీలో 1500 కుటుంబాలకు చెందిన వారు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు గుర్రప్ప, లోకేష్‌, ఎన్‌.వీ సుబ్బారెడ్డి, ఏ. శివారెడ్డి, సి.నాగరాజు, డి.శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌, వైఎస్సార్‌సీపీ నేత జరుగు రాజశేఖర్‌రెడ్డి వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాపక్షమే వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తోందన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదుగానీ రెండున్నరేళ్లలోనే 4లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ కడప జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందిందంటే అది దివంగత వైఎస్సార్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వల్లేనని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, దాడులు, గూండాయిజం పెరిగిపోయిందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా పోలీసులను ఉపయోగించి అనేక విధాలుగా ఇబ్బందులు పెడతారని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, నిత్యానందరెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య , షఫీ, పి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement