● జాతీయ స్థాయికి జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపిక
● విద్యార్థులను అభినందించిన డీఈఓ, డీఎస్‌ఓ
కడప ఎడ్యుకేషన్ : ఇన్‌స్పైర్ మనాక్ పోటీల్లో వైఎస్సార్ జిల్లా విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో మెరిశారు. ఇన్‌స్పైర్ మనాక్ జాతీయ స్థాయి పోటీలకు వైఎస్సార్ జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో 2023–24 విద్యా సంవత్సరానికి అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు వినూత్న రీతిలో రూపొందించి ప్రదర్శించిన ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి.
2023–24 విద్యా సంవత్సరానికి..
కడపలోని నిర్మలా ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఇ.బాలమధు రూపొందించిన ‘స్మాట్ చార్జింగ్ విత్ అటోమేనిట్ పవర్ కట్ ఆఫ్ ఫర్ ఎలక్ట్రిటిక్ వెహిల్స్’ అనే ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈ ప్రాజెక్టుకు మార్గదర్శక ఉపాధ్యాయులుగా చిన్నపుల్లయ్య వ్యవహరించారు.
2024–25 విద్యా సంత్సరానికి..
కడపలోని హజ్రత్ ఆయేషా ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఎస్.సనా ఫాతిమా రూపొందించిన ‘సెల్ప్ డ్రైవ్ ఓవర్ టేకింగ్ అలెర్ట్ సిస్టమ్’ అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ ప్రాజెక్టుకు మార్గదర్శక ఉపాధ్యాయురాలిగా సయ్యద్ నజ్నీస్ వ్యవహరించారు. జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికై న విద్యార్థులను, మార్గదర్శకం వహించిన ఉపాధ్యాయులను డీఈఓ షేక్ షంషుద్దీన్, డీఎస్‌ఓ లేవాక బాలాజీ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణ పట్ల ఆసక్తి, పరిశోధన దృకృథాన్ని పెంపొందించడంలో ఇన్‌స్పైర్ మనాక్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ మనాక్ కార్యక్రమంలో విద్యార్థులు ఈ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లాకు మరింత గుర్తింపు తీసుకురావాలని వారు విద్యార్థులకు సూచించారు.


