రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

నందలూరులో వెంకటాద్రి హాల్ట్‌

రాజంపేట: ప్రాంతీయ రైల్వే సమస్యల పరిష్కారానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని రైల్వే స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం రాజంపేటలోని మేడా భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు రెండో సారి ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సమావేశాల్లో రైల్వే భద్రత, స్టేషన్ల పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. జిల్లా మీదుగా నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కోవిడ్‌–19 కంటే ముందున్న హాల్టింగ్స్‌ను పునరుద్ధరించాలని రైల్వే బోర్డును కోరనున్నట్లు వివరించారు.

నందలూరు: కాచిగూడ–చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు నందలూరు రైల్వే స్టేషన్‌లో నిలుపుదల (హాల్ట్‌) కల్పించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రైలు స్టేషన్‌కు చేరుకున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. రైలు డ్రైవర్‌ను శాలువాతో సన్మానించి, ప్రయాణికులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నందలూరు ప్రజల చిరకాల డిమాండ్‌పై స్పందించి, రైలు నిలుపుదలకు ప్రత్యేకంగా కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement