● పెనవేసుకుంటున్న పెంపుడు బంధాలు | - | Sakshi
Sakshi News home page

● పెనవేసుకుంటున్న పెంపుడు బంధాలు

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

● పెనవేసుకుంటున్న పెంపుడు బంధాలు

కడప అగ్రికల్చర్‌: ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరితనం, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నేడు చాలామంది పెంపుడు జంతువులను (పెట్స్‌) ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇంటి కాపలా కోసమే కుక్కలను పెంచేవారు. కానీ, ప్రస్తుతం కాలం మారడంతో వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఎంత ఖర్చయినా వెనకాడకుండా కన్నబిడ్డల్లా సాకుతున్నారు. మరికొందరు వీధి కుక్కలను దత్తత తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మనుషుల బంధాలలో కల్తీ ఉండొచ్చేమో కానీ, మూగజీవాల ప్రేమానురాగాలలో ఎలాంటి కల్మషం ఉండదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. పెంపుడు జంతువులతో సమ యం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి, రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

పెంపుడు జంతువులపై నిస్వార్థమైన ప్రేమ..

పెంపుడు జంతువులు కేవలం సరదాకో, హోదా కోసమో కాకుండా కుటుంబ సభ్యుల్లా నిస్వార్థమైన ప్రేమను పంచుతూ విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకుంటున్నాయని ఇన్సూరెన్స్‌ మేనేజర్‌ జగదీష్‌, సేల్స్‌ మేనేజర్‌ వెంకటసుబ్బయ్య, దేవుని కడపకు చెందిన మంజుల, జంతు ప్రేమికురాలు కావ్య తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక్కోసారి వాటి సంరక్షణ కోసం తిరుపతి ట్రిప్స్‌ కూడా రద్దు చేసుకుంటున్నామని, వాటి తిండి, హెయిర్‌ కటింగ్‌ కోసం నెల నెలా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా భారం కాదని, ఇంట్లో మనుషుల్లా చూసుకుంటున్నామని వారు వివ రించారు. ఈ మూగజీవులను తెచ్చుకున్నాక భారంగా భావించి రోడ్లపై వదిలేయడం నేరమని, జీవితాంతం చూసుకునే నిబద్ధత ఉన్నప్పుడే పెంచాలని బద్వేలు అర్బన్‌ సీఐ బావిగడ్డ రామకృష్ణ స్పష్టం చేశారు. అదే సమయంలో, పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోటిక్‌ వ్యాధుల పట్ల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కడప పీవీపీ డీడీ రంగస్వామి సూచించారు.

1. ప్రాజెక్ట్‌ రీ–హాబ్‌ (కర్ణాటక మోడల్‌)

తేనెటీగల కంచె : కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఈ వినూత్న ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశారు. ఏనుగులు వచ్చే దారుల్లో వరుసగా తేనెటీగల పెట్టెలను తాడుతో అనుసంధానించి ఏర్పాటు చేస్తారు. ఏనుగులు ఆ తాడును తాకగానే తేనెటీగలు ఒక్కసారిగా పైకి లేస్తాయి. ఏనుగులకు తేనెటీగల జుమ్మనే శబ్దం అస్సలు పడదు. దీంతో ఏనుగుల మందలు గాయపడకుండానే వెనక్కి వెళ్లిపోతాయి.

2. ఏఐ ముందస్తు హెచ్చరికలు (అస్సాం, ఏపీ)

ఏఐ ఆధారిత నిఘా: అడవి సరిహద్దుల్లో థర్మల్‌ కెమెరాలు, సెన్సార్లతో కూడిన ఏఐ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. ఏనుగుల మంద అడవి దాటి గ్రామ సరిహద్దుల్లోకి రాగానే ఈ ఏఐ కెమెరాలు వాటిని గుర్తించి, తక్షణమే అటవీ అధికారులకు ఆటోమేటిక్‌ అలర్ట్‌ మెసేజ్‌లను పంపుతాయి.

3. ప్రత్యామ్నాయ పంటల సాగు (కేరళ మోడల్‌)

పంటల మార్పిడి వ్యూహం: కేరళ అటవీ శాఖ సరిహద్దు గ్రామాల్లోని రైతులతో ఏనుగులు అస్సలు తినని, అసహ్యించుకునే లెమన్‌గ్రాస్‌, అల్లం, పసుపు, మిరప వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. దీనివల్ల పంట నష్టం పూర్తిగా తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement