నేడు ప్రొద్దుటూరులో ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రొద్దుటూరులో ట్రాఫిక్‌ ఆంక్షలు

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో 2000 మంది పోలీసులతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కడప నుంచి జమ్మలమడుగు లేదా ఎర్రగుంట్ల వైపు వెళ్లే వాహనాలను కొత్తపల్లి సర్కిల్‌లోని డీ మార్ట్‌ వద్ద డైవర్షన్‌ చేయనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి రిలయన్స్‌ పెట్రోలు బంకు మీదుగా వాసవి సర్కిల్‌ నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల వైపు వాహనాలు వెళ్లాల్సి ఉంటుందన్నారు. జమ్మలమడుగు నుంచి కడప వైపునకు వెళ్లే వాహనాలు వైఎస్సార్‌ సర్కిల్‌ నుంచి వాసవి సర్కిల్‌, రిలయన్స్‌ పెట్రోలు బంకు మీదుగా కొత్తపల్లె సర్కిల్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మైదుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్తపల్లె సర్కిల్‌, వాసవి సర్కిల్‌, వైఎస్సార్‌ సర్కిల్‌ మీదుగా బొల్లవరంలోని మున్సిపల్‌ ప్లాట్లలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాలలో వాహనాలను నిలుపుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement