కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తు గడువు ఈ నెల 6 వరకు పొడిగించినట్లు కడప ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. కడప ప్రొహిబిషన్– ఎకై ్సజ్ స్టేషన్ స్టేషన్ పరిధిలో మొత్తం 7 దుకాణాలు నోటిఫై చేసినట్లు తెలిపారు. వార్షిక లైసెన్స్ ఫీజు రూ. 71.5 లక్షలు కలిగిన దుకాణాలు 5 ఉన్నాయన్నారు. అందులో కడప టౌన్ పరిధిలో 3, ఖాజీపేట మండలం పరిధిలో 2 దుకాణాలు ఉన్నాయని వివరించారు. అలాగే చెన్నూరులో ఒకటి, పెండ్లిమర్రిలో మరొకటి వార్షిక లైసెన్స్ ఫీజు రూ. 61.5 లక్షలు కలిగిన దుకాణాలు ఉన్నాయని.. వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కడప ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
గండికోటకు వరద నీరు
కొండాపురం : నంద్యాల జిల్లాలోని ఆవుకు జలాశయం నుంచి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా వరద నీరు గండికోట రిజర్వాయర్‌లోకి వస్తోందని.. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19 టీఎంసీలు చేరినట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గండికోట పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19 టీఎంసీలు చేరినట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 695.54 అడుగులు ఉండగా 689.1 అడుగుల నీటిమట్టానికి చేరిందన్నారు. కొండాపురం, ముద్దనూరు, తాడిపత్రికి జేసీ తాగునీటి పథకాలకు సీపీ డబ్లూ స్కీం ద్వారా 20 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామని తెలిపారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : సబ్‌జూనియర్స్ బాలబాలికల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు ఆదివారం కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు గురుశేఖర్ తెలిపారు. ఈ ఎంపికలను టి.శ్రీవాణి, జె. వెంకటసుబ్బన్న, పీడీ సునీల్, కోచ్ లీలావతి, పీడీ లక్ష్మి, నరేష్ పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశామని వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు వెస్ట్ గోదావరి జిల్లా నూజివీడులో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే..
బాలుర జట్టు : వి.జనార్ధన్, వి.చరణ్,డి. మనోజ్, ఎం.అనుదీప్, జి.మేఘశ్యామ్, జి.య శ్వంత్ రెడ్డి, జి.హర్షవర్ధన్, జి.వెంకట విశాల్, సాయినాథ్, టి.నరేంద్ర, బి.నిత్య ప్రియా నాయ క్, కె.వరుణ్ కుమార్, ఎస్.ఉస్మాన్, జి.రామ్ చరణ్, ఎస్.ఎం.డి.అమాన్, ఎం.లోహిత్,
బాలికల జట్టు : ఎన్. నాగమణి, కె.కావ్య శ్రీ, ఆర్. అమృత,సి. ధనుష, సి.ప్రణిత, ఎస్. సాయి కుమారి, కె. సాయి కీర్తన, బి. ప్రసన్న, ఎం.శారా, బి. దేవహర్షిణి, ఎం. కీర్తి, పి. హుస్సేన్‌బీ, డి.వి.సుభహేమ, ఎన్.వి. అక్షయ, ఎం.బ్లెస్సీ, కె. త్రివేదితా.
గాలివీడు రామాలయానికి పిడుగుపాటు
గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో ఆదివారం స్థానిక గేటు సమీపంలో వెలసిన శ్రీరామాలయ ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపడిన తీవ్రతకు ఆలయ ధ్వజస్తంభం కింది భాగంలోని రాతి దిమ్మె పాక్షికంగా దెబ్బతింది, ఆదివారం కావడంతో ఆలయంలో పూజల కోసం భక్తులు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. పిడుగు పడిన క్షణంలో భారీ శబ్దం రావడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు, స్థానిక నివాసితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో గర్భాలయానికి కానీ, ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు కానీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ధ్వజస్తంభం పిడుగుపాటుకు గురికావడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.


