రోడ్లపై ‘గుంత’లు.. పాలకుల కళ్లకు గంతలు! | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై ‘గుంత’లు.. పాలకుల కళ్లకు గంతలు!

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

‘మేం అధికారంలోకి వస్తే రోడ్లను గుంతలు లేని రహదారులుగా చేస్తాం.. ఊరూరా రోడ్లు వేస్తాం’ ఇదీ.. కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన హామీలు... అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతాంది.. కొత్త రోడ్లు కాదుకదా గుంతలు తేలిన ఇలాంటి పాత రోడ్లకు మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసే హడావుడి చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుంటుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘వచ్చే సంక్రాంతికల్లా గ్రామీణ రోడ్లను అందంగా మారుస్తాం... అద్దంలా చేస్తా’మంటూ ఊగిపోయారు.. పల్లెల్ని అభివృద్ధి బాట పట్టిస్తామంటూ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. రాజుపాళెం మండలంలోని అయ్యవారిపల్లె నుంచి గాదెగూడూరు గ్రామానికి వెళ్లే ఈ దారే దీనికి సాక్ష్యం. గాదెగూడూరు గ్రామ సమీపంలో రాళ్లు తేలి దరిద్రంగా తయారైంది. ఇది మచ్చుకు మాత్రమే.. జిల్లావ్యాప్తంగా పల్లెదారులు చాలా వరకు ఇలానే ఉన్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని.. అధికారులు స్పందించి రాళ్లుతేలిన రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.– రాజుపాళెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement