గాయపడిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన వ్యక్తి మృతి

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

నందలూరు : మండలంలోని గట్టుమీదపల్లి గ్రామానికి చెందిన బెల్లం కొండయ్య, బెల్లం చిన్నయ్య ఆదివారం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో బెల్లం కొండయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనలో బెల్లం చిన్నయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

చెప్పుల షాప్‌లో నగదు చోరీ

రాజంపేట : పట్టణంలోని పాతబస్టాండు సమీపంలో మయూరి షూమార్ట్‌లో సోమవారం ఓ మహిళ నగదు చోరీకి పాల్పడింది. చెప్పులు కొనుగోలు చేసేందుకు దుకాణంలోకి కస్టమర్‌లా షాపు ఎదుట నిలబడింది. అయితే కౌంటర్‌లో ఉన్న వ్యక్తి కన్నుగప్పి నగదును దొంగలించింది. ఆలస్యంగా గుర్తించిన షాపు నిర్వహకుడు, సీసీ కెమరాలు పరిశీలించడా చోరీ బహిర్గతమైంది.

చోరీ కేసులో ఆరుగురి అరెస్టు

చాపాడు : ఫిబ్రవరి నెలలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని గొలుసు అపహరించిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు రూరల్‌ సీఐ శివశంకర్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 8న మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ప్రొద్దుటూరుకు ప్రయాణిస్తున్న వైఎస్సార్‌ కాలనీకి చెందిన కె.సరోజ మెడలో 15 గ్రాముల గొలుసు అపహరణ అయినట్లు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు విచారణ చేపట్టగా తమిళనాడుకు చెందిన విజయ్‌, మారియప్పన్‌, మణికందన్‌, లక్ష్మి, మారిశ్వరి, విజయలను మంగళవారం అరెస్టు చేశామన్నారు. వీరు మైదుకూరు ప్రాంతంలో వంగనూరు లక్ష్మమ్మ అనే మహిళ వద్ద కూడా రెండు తులాల బంగారు గొలుసును అపహరించినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు చిన్న పెద్దయ్య, వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement