రాజంపేట: ఒంటిమిట్ట రామాలయం చరిత్రాత్మమైనదని, ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపింపచేయాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కలిసి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)లోని శ్రీ కోదండరామున్ని దర్శించుకున్నారు. అనంతరం తూర్పు గాలిగోపురం వద్ద మీడియాతో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రాములవారి గుడి అంటే ఒంటమిట్ట రామాలయం అని భక్తులు విశ్వసిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము రామాలయం అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. ఆలయం అభివృద్ధి, భక్తులకు సౌకర్యం కల్పనకు సంబంధించి తాను ముందంజలో ఉంటానన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పుడూ ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగుకుండా బ్రహ్మోత్సవాలు బ్రహ్మండంగా తిరుమల తిరుపతి దేవస్ధానం, ప్రభుత్వం నిర్వహించాలన్నారు. మంచి కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ మద్దత్తు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ప్రజలందరికి శ్రీరాముని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నేతలు చొప్పా ఎల్లారెడ్డి, జెడ్పీమాజీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, సిద్దవరం గోపిరెడ్డి, మేకపాటి నందకిషోర్‌రెడ్డి, ఆకేపాటి శివారెడ్డి, మహిళరాష్ట్రనాయకురాలు ఏకులరాజేశ్వరీ రెడ్డి, రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి పాల్గొన్నారు. అంతకముందు ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీలకు శాలువాలు కప్పి సత్కరించారు.
రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి


