సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహాకవి పుట్టపర్తి | - | Sakshi
Sakshi News home page

సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహాకవి పుట్టపర్తి

Mar 29 2026 7:05 AM | Updated on Mar 29 2026 7:05 AM

కడప అర్బన్‌: తెలుగు పదాలతో ‘శివతాండవం’ఆడించి, తెలుగు సాహితీ కారుల్లో అగ్రగణ్యుడుగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు అని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ కొనియాడారు. శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని పురస్కరించుకుని సరస్వతి పుత్రుడి చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా ఎస్పీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం మూర్తీ భవించిన వ్యక్తిత్వం నారాయణాచార్యులదని పేర్కొన్నారు. ‘శివతాండవ కావ్యం’చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదని, కనురెప్ప వాల్చనీయదన్నారు. అనితర సాధ్యమైన కావ్యాన్ని రచించి సాహిత్యాకాశంలో ‘పుట్టపర్తి’ధ్రువతారగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె.ప్రకాష్‌ బాబు, ఏ.ఆర్‌ అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్‌ డీఎస్పీ పీ.నాగేశ్వర రావు, ఆర్‌.ఐ శివరాముడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement