జాంబవంతుని శోభ..అజరామరం | - | Sakshi
Sakshi News home page

జాంబవంతుని శోభ..అజరామరం

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

108 అడుగుల విగ్రహం ఏర్పాటుపై కసరత్తు

దాశరథి కల్యాణంరోజున విగ్రహానికి

శంకుస్థ్ధాపన?

ఏకశిలానగరంలోని ఒంటిమిట్ట చెరువు

ఏకశిలానగరంలోని శ్రీ కోదండరాముని ఆలయం

రాజంపేట : ఏకశిలానగరికి జాంబవంతుని శోభ సంతరించుకోనుంది. జాంబవంతుడు సీతారామ,లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించినందుకు ఇప్పుడు జాంబవంతుని కీర్తిప్రతిష్టలు ఇనుమడించనున్నాయి. ఏపీలో రామారాధనకు ప్రముఖ కేంద్రంగా ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచేలక్ష్యంతో రామాయణంలో కీలక పాత్ర పోషించిన జాంబవుంతుని విగ్రహాన్ని రాములోరి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టించాలని యోచిస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్గొంటున్నాయి. ఏకశిలానగరం(ఒంటిమిట)లో ఇప్పుడు రామాలయం సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటు దిశగా టీటీడీ మాస్టర్‌ప్లాన్‌ తీసుకొచ్చింది. ఆలయాన్ని అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో సాంస్కృతిక పర్యాటకాన్ని పెంపొదించడానికి రూపొందించిన బృహత్‌ ప్రణాళికలో జాంబవంతుడు విగ్రహం ఏర్పాటు ఒక భాగమని టీటీడీ వర్గాలు తెలిపాయి.

అన్నమయ్య విగ్రహం తరహాలో..

తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి సందర్భంగా 108 అడుగుల విగ్రహాన్ని అప్పటి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది రాజంపేటకే ల్యాండ్‌మార్క్‌గా మారింది. ఇదే తరహాలోనే ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఏకశిలానగిరికి ల్యాండ్‌ మార్క్‌గా నిలిచేలా రూపకల్పన జరుగుతోంది. భవిష్యత్తులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారనుంది. కాగా ఇప్పటికే దాశరధి కల్యాణమండపం సమీపంలో నామమాత్రంగా జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

అధ్యాతిక్మ క్షేత్రంగా..

ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లోని శ్రీ కోదండరామాలయం అధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది ఒంటిమిట్ట చెరువు జాతీయరహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో వైపు జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. వచ్చెనెల 1న రాము లోరి కల్యాణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అదే రోజున సీఎం చేతుల మీదుగా జాంబవంతుని విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా టీటీడీ ఇంకా ప్రకటించలేదు. మరోవైపు విగ్రహానికి సంబంధించి డిజైన్‌ తుదిదశకు చేరుకున్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement