సాక్షి టాస్క్‌పోర్స్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఆదివారం వీరపునాయునిపల్లె మండలంలోని ఉరుటూరు గ్రామ సచివాలయం వద్ద స్థానిక తెలుగుదేశం నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆగస్టు 15, జనవరి 26న జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి విరుద్ధంగా టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని, ఇలాంటి వి జరగకుండా అధికారులుచర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీటీసీ లక్ష్మిరామాంజనమ్మ అన్నారు.ఈ విషయంపై మండల అబివృద్ది అధికారి శేషా చలపతిని వివరణ కోరగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ జెండాలను ఎగురవేయడం చట్టవిరుద్ధం, ఆదివారం కావడంతో అధికారులు లేరని ఉండి ఉంటే అలా జరిదేది కాదని, వెంటనే తీసేయిస్తానని, ఇక మీదట ఇలా జరగకుండా చర్యలు తీసుకొంటామని తెలిపారు.


