ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కడప జిల్లా ఎస్పీ ఎస్. నచికేత్ విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భద్ర తా ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, విజిలెన్స్ ఎస్పీ మురళీకృష్ణ, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేతో కలిసి పరిశీలించారు. ముందుగా వారు ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల క్యూలైన్లు, సీఎం గెస్ట్ హౌస్, కల్యాణ వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పట్లపై పోలీసులకు దిశానిర్దేశం ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సుమారు 3 వేల మంది పోలీసులతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఎస్పీ నచికేత్ విశ్వనాథ్


