కడప సిటీ/చక్రాయపేట : రాయలసీమ ముద్దుబిడ్డగా చెప్పుకుంటూనే, ఆ ప్రాంత ప్రయోజనాలను సీఎం చంద్రబాబు నాయుడు నిలువునా వంచిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూటమి సర్కారు పంగనామాలు పెడుతోంది. ఇందులో అంతర్భాగమైన కాలేటివాగు ప్రాజెక్టు పనులను అటకెక్కించి ఈ ప్రాంత రైతులకు కోలుకోలేని ద్రోహం చేస్తోంది.
90 శాతం పనులు పూర్తి..
చక్రాయపేట మండలంలోని వర్షాధార భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ సర్కారు రూ. 500 కోట్లతో కాలేటివాగు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జీఎన్‌ఎస్‌ఎస్ కెనాల్ నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించేలా ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి చేశారు. కేవలం 10 శాతం పనులు పూర్తి చేసి ఉంటే, 2025 నాటికే ఈ ప్రాంత రైతాంగం ముక్కారు పంటలతో కళకళలాడేది. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే సీన్ మారిపోయింది.
కుంటి సాకులతో బ్రేకులు
ప్రాజెక్టు పనులను ఆపివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రకరకాల కుంటిసాకులు వెతుకుతోంది. 90 శాతం పనులు పూర్తయినప్పటికీ.. పైప్‌లైన్ పనులను కలిపి చూపిస్తూ 25 శాతం పనులు జరగలేదనే దురుద్దేశ్యంతో పనులను నిలిపివేసింది. విజిలెన్స్ తనిఖీలు, రీ–టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
నిలిచిపోయిన కాలేటి వాగు పనులు – వెక్కిరిస్తున్న అసంపూర్తి నిర్మాణాలు
సాగునీటి కల సాకారమయ్యే వేళ.. నిలిచిపోయిన కాలేటివాగు టన్నెల్ పనులు
పూర్తి కాని కాలేటివాగు పనులు
వైఎస్ జగన్ హయాంలో
90 శాతం పూర్తయిన పనులు
కూటమి సర్కారు నిర్వాకంతో
రైతులకు శాపం
10 శాతం పనులపై 100 అబద్ధాలు
రీ–టెండర్ల పేరిట కాలయాపన
సమీక్షల్లో లేని ‘కాలేటి’ ప్రస్తావన
అన్నదాతల గుండెల్లో పెనువేదన


