వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి

Jan 11 2026 7:38 AM | Updated on Jan 11 2026 7:38 AM

వైఎస్

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి

యోగా మాస్టర్‌ సునందకు సిల్వర్‌ మెడల్‌

ప్రొద్దుటూరు కల్చరల్‌ : స్థానిక 33వ వార్డుకు చెందిన యోగా మాస్టర్‌ చౌడం సునంద ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి యోగాసనాల పోటీల్లో పాల్గొని సిల్వర్‌ మెడల్‌ సాధించింది. ఈ పోటీల్లో 19 రాష్ట్రాలకు చెందిన యోగా క్రీడాకారులతో ఆమె పోటీ పడి రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సిల్వర్‌ మెడల్‌ సాధించిన సునందను అభినందించారు. టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌, జహీరుద్దీన్‌ పాల్గొన్నారు.

వైఎస్‌ అభిషేక్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు

వైఎస్‌ అభిషేక్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి, తదితరులు

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నవైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, ఫాదర్లు

పులివెందుల/రూరల్‌ : ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి మనుమడు, వైఎస్సార్‌సీపీ తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్‌ మధురెడ్డి కుమారుడు దివంగత వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు నివాళి అర్పించారు. పులివెందుల పట్టణంలోని స్థానిక అంబకపల్లె రోడ్డులో ఉన్న వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిరెడ్డితో పాటు ఆమె సోదరుడు ఈసీ దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత వారు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చిన్న వయస్సులో రాష్ట్ర వైద్య విభాగపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే పార్టీ కోసం అనేక సేవలు అందించి గొప్ప వ్యక్తిగా వైఎస్‌ అభిషేక్‌రెడ్డి నిలిచిపోయారన్నారు. ఆయన మరణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని వాపోయారు. అనంతరం వైఎస్‌ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎస్‌ఐ చర్చి ఫాదర్‌ బాబు, మృత్యుంజయరావు, మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరలోకంలో ఉన్న వైఎస్‌ అభిషేక్‌రెడ్డికి శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు.

వైఎస్‌ అభిషేక్‌రెడ్డి జీవితంపై పుస్తక ఆవిష్కరణ

దివంగత వైఎస్‌ అభిషేక్‌రెడ్డి జీవితంపై వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఆయన వైద్య విభాగంలో చేసిన సేవలను, రాజకీయ రంగంలో చేసిన సేవలను అందులో పొందుపరిచారు. వర్థంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, ఫాదర్ల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వైఎస్‌ పద్మావతి, మాధవి, వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి, మాధవీలత, సౌఖ్య, అక్షర, ఆకర్ష, కృష్ణ చైతన్య, మంజుల, సర్వోత్తమరెడ్డి, అర్జున్‌రెడ్డి, వైఎస్‌ జోసఫ్‌రెడ్డి, వైఎస్‌ వెంకటరెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ ప్రమీలమ్మతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు దుష్యంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, జ్యోతి, శ్రీహితరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చిన్నప్ప, వైస్‌ చైర్మన్‌ సర్వోత్తమరెడ్డి ఉన్నారు.

ఘాట్‌ వద్ద ప్రార్థనలు..

వైఎస్సార్‌సీపీ వైద్యవిభాగపు రాష్ట్ర కార్యదర్శి దివంగత వైఎస్‌ అభిషేక్‌రెడ్డి తొలి వర్ధంతి సందర్భంగా శనివారం పట్టణంలోని స్థానిక లయోలా డిగ్రీ కళాశాల రోడ్డుకు వెళ్లే దారిలో ఉన్న వైఎస్‌ ఫ్యామిలీ తోటలో దివంగత వైఎస్‌ అభిషేక్‌రెడ్డి సమాధి వద్ద వైఎస్‌ కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. ఆయన సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి 1
1/2

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి 2
2/2

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement