హాయిగా హాయిగా.. హైవే!
వైఎస్ జగన్ హయాంలో..
రాజంపేట: కడప మీదుగా బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఎన్‌హెచ్–544జీ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ప్రస్తు తం తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ రహ దారి అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య రవాణా వ్యవస్ధలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
11 గంటల నుంచి 6గంటలలో..
ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే దాదాపు 11 నుంచి 12 గంటల సమయం పడుతోంది. భారత్‌మాల పరియోజన ఫేజ్–2 కింద నిర్మిస్తున్న ఈ ఆరులైన్ల యాక్సెస్–కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా ప్రయాణ సమయం కేవలం ఆరు గంటలుగా మారనుంది. వాహనాల వేగవంతమైన ప్రయాణానికి వీలుగా, ఎలాంటి అడ్డంకులు లేని రీతిలో ఈ రహదారిని డిజైన్ చేశారు.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు
రూ19,320 కోట్ల వ్యయంతో 624 కి.మీ (గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ కలిపి) రహదారి నిర్మిస్తున్నారు. 14 ప్యాకేజీలతో నిర్మాణం కొనసాగుతోంది. మేఘా ఇంజినీరింగ్, కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్, దిలీప్ బిల్డ్‌కాన్ వంటి సంస్ధలు పనులు చేపట్టాయి.
నాలుగు జిల్లాల మీదుగా కారిడార్..
నాలుగు జిల్లా మీదుగా కారిడార్ మార్గం నిర్మిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా సాగుతుంది. ప్రధానంగా జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల గుండా (గ్రీన్‌ఫీల్డ్ లైన్‌మెంట్) వెళ్లడం వల్ల పాత రహదారులపై ట్రాఫిక్ వత్తిడి తగ్గనున్నది.
ఆర్థిక వృద్ధికి బాటలు: హైవే కేవలం ప్రయాణ సౌకర్యాన్నే కాకుండా, ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానైట్ వంటి ఖనిజాలు విజయవాడ, బెంగళూరు మార్కెట్లకు.. అలాగే తూర్పు తీరంలోని ఓడ రేవులకు వేగంగా తరలించే వీలుటుంంది. 2026 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
పర్యావరణ, అటవీ అనుమతులు
ఈ రహదారి మార్గం తూర్పు కనమల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం వంటి సున్నితమైన చోట్ల పర్యవరణానికి ముప్పు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం టన్నెల్ (సొరంగం మార్గం)నిర్మాణాలను చేపట్టింది. కొన్ని అటవీ ప్రాంతాల్లో క్లియరెన్స్‌ల కోసం కొంత సమయం పట్టినప్పటికి, ప్రస్తుతం పనులు సాఫీగా సాగుతున్నాయి.
ఎక్కడ మొదలై..
ఎక్కడ ముగిస్తుంది?
ఈ రహదారి ప్రధానంగా బెంగళూరు (కర్ణాటక)లో మొదలై విజయవాడ (ఆంధ్రప్రదేశ్) వద్ద ముగుస్తుంది. ఇది 11 జిల్లాల (కర్ణాటకలో 3, ఏపీలో 8) మీదుగా సాగుతుంది.
ప్రధానమార్గం
బెంగళూరు (ఎన్‌హెచ్044 ద్వారా కొడికొండ వరకు బ్రౌన్ ఫీల్డ్ అప్‌గ్రేడ్), కొడికొండ (శ్రీ సత్యసాయిజిల్లా) నుంచి అసలైన గ్రీన్‌ఫీల్డ్ సెక్షన్ ప్రారంభమవుతంది.
వైఎస్సార్ కడప జిల్లాలో ఏయే ఊళ్లు..
బెంగళూరు హైవే వైఎస్సార్ కడప జిల్లా మీదుగా వెళుతోంది. పులివెందుల, ఎర్రగుంట్ల, కడప, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. ఈ రహదారి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద పెద్దపరిమి సమీపంలో ముగిసేలా ప్లాన్ చేశారు. దీని వల్ల పాత జాతీయ రహదారులపై ఉన్న ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది.
పోరు
మామిళ్ల
మైదుకూరు
ఎర్రగుంట్ల
పులివెందుల
వైఎస్సార్ జిల్లా
మీదుగా వెళ్లే ప్రాంతాలు
కడప మీదుగా బెంగళూరుకుగ్రీన్‌ఫీల్డ్ రహదారి
భారత్‌మాల పరియోజనఫేజ్–2లో ఆరులైన్లు
ఆరు గంటలలో గమ్యానికి చేరిక
14 ప్యాకేజీలతో శరవేగంగా నిర్మాణం
కడప జిల్లాకు మహర్దశ
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలులో భూసేకరణ కీలకపాత్ర పోషించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషిచేశారు. కడప జిల్లాలో మెజార్టీ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పరిహారం అందచేస్తూ వచ్చారు.
హాయిగా హాయిగా.. హైవే!
హాయిగా హాయిగా.. హైవే!


