ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ జిల్లా ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నంద్యాల జిల్లా అధ్యక్షులు మౌలాలి, పరిశీలకులుగా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శివశంకర్ వ్యవహరించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. సోమవారం కడపలోని జిల్లా ఎస్టీయూ కార్యాలయం లో నూతన కార్యవర్గ వివరాలను రాష్ట్ర సంయుక్త అధ్యక్షులు సురేష్ బాబు ప్రకటించారు. ఇందులో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా సంగమేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూసెట్టి పాలకొండయ్య, ఆర్థిక కార్యదర్శిగా సుబ్రమణ్యం, రాష్ట్ర కౌన్సిలర్లుగా మల్లు రఘునాథరెడ్డి, ఇలియస్ బాష, కంభం బాలగంగిరెడ్డి, గురుకుమార్, దాదా పీర్, ఎన్ వెంకటసుబ్బయ్య, చెన్నకేశవ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పెంచలయ్య, వెంకటేశ్వర బాబు, కుండా భాస్కర్, మస్తాన్, కృష్ణా రెడ్డి, వెంకట సుబ్బయ్య, జి.సి.యమ్ రెడ్డి, కరీం, వాకా చంద్రశేఖర్, రవికేశవ్ రావు, పుల్లయ్య, చంద్రహాస రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జి శివారెడ్డి, అంగడి నాగేంద్ర, భాస్కర్ రెడ్డి, షేక్ మహబూబ్ బాషా, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా ప్రతాప్ రెడ్డి పద్మాకర్, రమేష్, రాజా మహేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి, శేఖర్ బాబు, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా ఎస్ ధర్మారెడ్డి, ఓబన్న, ప్రసాద్ బాబు, సుబ్రహ్మణ్యం, రామ్మోహన్, మునయ్య, పద్మనాభరావు, గురువయ్య, ఉపాధ్యక్షులుగా అన్వర్ బాషా, ఉపేంద్ర, శివరాం మునిబాబు ఓబులేసు, ఓబుల్ రెడ్డి, అబ్దుల్ వాజిద్, ఆది కృష్ణారెడ్డి, బాలరాజు, చంద్రశేఖర్, నరసింహారెడ్డి, జిల్లా సెక్రటరీలుగా ఇబ్రహీం, జనార్దన్ రెడ్డి, లక్ష్మయ్య, మల్లేష్, సంజీవరెడ్డి తదితరులు నియమితులయ్యారు.


