
వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ద
కడప రూరల్: ప్రభుత్వ హోమియోపతి కాలేజీలు కడపతోపాటు గుడివాడ, రాజమండ్రిలో మాత్రమే ఉన్నాయి. పాలకుల నుంచి ఆలన..పాలన లేకపోవడంతో ఈ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధానంగా ఈ వైద్య రంగంలో విద్యను అభ్యసించే వారికి కష్టతరంగా మారింది.
‘యూజీ‘లకు తీవ్ర నష్టం
డాక్టర్‌గా సేవలు అందించాలనేది బైపీసీ విద్యార్థుల కల. నీట్ పరీక్షలు రాశాక, ర్యాంకులు, ఇతర నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం వరస క్రమంలో మొదటగా ఎంబీబీఎస్ తరువాత బీడీఎస్ (డెంటల్), ఆయుర్వేదం, హోమియెపతి, యూనానిలో సీట్లను కేటాయిస్తారు. కాగా హోమియోపతికి సంబంధించి ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చిన వారు నాలుగున్నరేళ్ల పాటు యూజీ (అండర్ గ్రాడ్యుయేట్), ఒక ఏడాది హౌస్ సర్జన్‌గా చేయాలి. అనంతరం కీలకమైన పీజీ (పోస్టు గ్రాడ్యుయేట్) పూర్తి చేయాలి. ఇది మూడేళ్ల కోర్స్. ఈ కోర్స్‌ను పూర్తి చేసిన వారు మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా లేదా డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్‌గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. పీజీకి అర్హత సాధించాలంటే ఇంకా కష్టపడి చదవాలి. కాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో ఏటా 38 మంది విద్యార్థులు యూజీ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి వారు కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి ఒక్క పీజీ సీటును కూడా కేటాయించకపోవడం దారుణం. గుడివాడ కాలేజీకి మాత్రమే సీట్లను కేటాయించడం గమనార్హం. ఇప్పుడు కడప కాలేజీకి పీజీ సీట్లను కేటాయించకపోవడం వల్ల.. ఇకపై పీజీ సీట్లను కేటాయించరనే వాదన వినిపిస్తోంది. అదే గనుక జరిగేతే యూజీ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రయాదం ఉందని.. ఈ రంగానికి చెందిన ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రభుత్వ హోమియోపతి కాలేజీలకు
పీజీ సీట్ల కేటాయింపుల వివరాలు
సంవత్సరం 2024 2025
యూజీ పీజీ యూజీ పీజీ
పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణం
కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీపై శీతకన్ను
పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కేటాయించని కౌన్సిల్
పట్టించుకోని పాలకులు
కడప 38 08 38 –
గుడివాడ 50 24 50 12
రాజమండ్రి 60 24 50 –
కేటాయింపుల కోసం ప్రయత్నాలు
కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్ల కేటాయింపుల అంశానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్ కమిషనర్ దినేష్‌కుమార్ చర్యలు చేపడుతున్నారు.
– డాక్టర్ శోభారాణి, ఇన్‌చార్జి ప్రిన్సిపల్,
ప్రభుత్వ హోమియోపతి కాలేజీ, కడప
కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కకావికలమైంది. ఆ రంగానికి చెందిన అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పులివెందుల వంటి మెడికల్ కాలేజీ కనుమరుగైంది. కేటాయించిన సీట్లు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే ఒరవడిలో హోయోపతి వైద్య రంగం కూడా సమస్యలతో సతమతం అవుతోంది. పాలకపక్షం నుంచి కేంద్రంను ‘మాకు మెడికల్ కాలేజీలు.. మెడికల్ సీట్లు కావాలి’ అని అడిగే వారే కరువయ్యారు. దీంతో వైద్య రంగం పతనావస్థకు చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ద

వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ద