రైతు ఖాతాలకు నగదు జమ | - | Sakshi
Sakshi News home page

రైతు ఖాతాలకు నగదు జమ

Aug 3 2025 3:38 AM | Updated on Aug 3 2025 3:38 AM

రైతు ఖాతాలకు నగదు జమ

రైతు ఖాతాలకు నగదు జమ

కడప అగ్రికల్చర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకాల నిధులు శనివారం రైతు ఖాతాలకు జమ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్‌ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రూ.5 వేలు ఇలా మొత్తంగా రెండు పథకాలకు సంబంధించి 2025–26వ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతలో భాగంగా 1,94,047 మంది రైతులకు రూ.132.93 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ నిధుల రాకతో అన్నదాతలకు పంటల సాగుకు కాసింత ఆర్థిక చేయూత లభించింది.

డిప్లొమో ప్రవేశాల

గడువు పొడిగింపు

కడప ఎడ్యుకేషన్‌: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో కోర్సు లలో ప్రవేశానికి ఈ నెల 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల పంచాలకులు టి.లక్షీప్రసాద్‌ తెలిపారు. జర్మలిజం శాఖ ఆధ్వర్వంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ పబ్లిక్‌ రిలేషన్‌ (పీజీడీపీఆర్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లమా ఇన్‌ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే), ఫైన్‌ ఆర్ట్స్‌ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తర్ణీత సాధించిన వారు అర్హులన్నారు. కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు అన్ని రకాల అర్హత పత్రాలతో నేరుగా విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు. సాయంకాల తరగతులు కావడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు, పీజీ స్థాయి కోర్సులు చదువుతున్న వారు కూడా ఇందులో ప్రవేశం పొందవచ్చన్నారు. వివరాలకు యోగి వేమన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.yvu.edu.inను సందర్శించాలని సూచించారు.

5న గెస్ట్‌ ఫ్యాకల్టీల

నియామకానికి ఇంటర్వ్యూలు

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన యూనివర్సిటీ పీజీ కళాశాలలోని ఎంబీఏ విభాగానికి గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకం కోసం ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ టి.శ్రీనివాస్‌ తెలిపారు. ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ ఆలైడ్‌ బ్రాంచెస్‌), ఎంసీఏ, ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) అర్హతలు కలిగి ఉండాలన్నారు. ఎంబీఏ విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ పేపర్లు, అలాగే అనుబంధ అంశాలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్‌ ఇన్‌ ఆర్‌, మిషన్‌ లెర్నింగ్‌, ఐఓటీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా వేరు హౌసింగ్‌ అండ్‌ మైనింగ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, టాబ్ల్యూ, పవర్‌ బీ ఐ, డీజీఎంఎస్‌, డేటా విజువలైజేషన్‌లలో బోధించే వారు కావాలన్నారు. అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు బయో–డేటా అలానే సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలతో నేరుగా ప్రిన్సిపల్‌ కార్యాలయంలో జరిగే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావా లని సూచించారు. రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు www. yvu.edu.in వైబ్సెట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

అన్నదాతల పంటల

సాగుకు చేయూత

కడప అగ్రికల్చర్‌: అన్నదాతల పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోందని కృషి విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వీరయ్య పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 20వ విడత నిధులు రైతుల ఖాతాలోకి రూ. 2 వేల నగదు జమకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూపీలోని వారణాసిలో ప్రారంభించిన ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం శనివారం కేవీకేలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్‌ కింద ఏటా రైతులకు రూ.6 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. కడప ఏడీఏ సురేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కడప నియోజకవర్గంలో 1576 మంది రైతులకు 19 లక్షలు పీఎం కిసాన్‌ డబ్బులు రైతు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. అనంతరం మెగా చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్ర సమన్వయకర్త అంకయ్యకుమార్‌, ఆత్మ పీడీ విజయలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు ప్రశాంతి, శిల్పకళ, మహేష్‌బాబు, మానస, సురేస్‌రెడ్డి, గిరీష్‌కుమార్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement