
నిత్యాన్నదానానికి లక్ష వితరణ
విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి
కడప కార్పొరేషన్: గాలులకు తెగిపడిన విద్యుత్ లైన్లకు ప్రజలు దూరంగా ఉండాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్. రమణ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలు స్వయంగా మరమ్మతులు నిర్వహించుకోకుండా సంబంధిత విద్యుత్ అధికారులకుగానీ, సిబ్బందికి గానీ తెలియజేసి వారిద్వారా పరిష్కరించుకోవాలన్నారు. తద్వారా విద్యుత్ ప్రమాదాలను అరికట్టాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం వాట్సప్ ద్వారా వాలిపోయిన విద్యుత్ స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు లైన్లు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు 9440814264 నంబర్‌కు విద్యుత్ సమస్యలకు సంబంధించి ఫిర్యాదుదారుని పేరు, సమస్యకు సంబంధించిన ఫొటోలు, గ్రామం, మండలం, మొబైల్ నెంబరుతో పంపించాలన్నారు. హెల్ప్ డెస్క్ లో ఉన్న సిబ్బంది సంబంధిత అధికారులకు తెలియజేసి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు.
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఆదివారం రూ.1,01,116లు విరాళంగా వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. పులివెందులకు చెందిన రాధాకృష్ణ మూర్తి జ్ఙాపకార్థం కృష్ణవేణమ్మ, కుమారుడు దక్షిణామూర్తి, కోడలు లక్ష్మీప్రసన్న నగదు రూపంలో విరాళం ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, ప్రధాన అర్చ కుడు కేసరి,పాలకమండలి సభ్యులు పబ్బతి బింధుసాగర్ తదితరులు పాల్గొన్నారు.
● ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్ నంబర్ ఏర్పాటు
● జిల్లా విద్యుత్ శాఖ అధికారి సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్.రమణ

నిత్యాన్నదానానికి లక్ష వితరణ