యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేసి, తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజలను చేశారు. ఇక ముఖ మండపంలోని బంగారు ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలను జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించి, సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధిలో జోడు సేవలను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

కొనసాగుతున్న పండుగ రద్దీ

చౌటుప్పల్‌ : హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బుధవారం సైతం కొనసాగింది. ఇరు మార్గాల్లోనూ వాహనాలు బారులుదీరి రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం తెల్లవారుజాము నుంచి ఉదయం 11గంటల వరకు, సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్‌ పట్టణంలో అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో సమస్య తీవ్రత మరింత ఎక్కువైంది. మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామం నుంచి మున్సిపాలిటీ పరిధిని దాటేందుకు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సివస్తోంది.

పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఆలేరు : పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గడసంతల మధుసూదన్‌ బుధవారం ప్రకటించారు. జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులుగా గుండెబోయిన మల్లయ్య, కె.చంద్రశేఖర్‌, రావుల సత్యనారాయణరెడ్డి, ఎండీ.ఖాజావలీ, జె.సతీష్‌కుమార్‌, మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలిగా ఆకారపు జ్యోతిర్మయి, ఉపాధ్యక్షుడిగా ఎన్‌.దశమంతరెడ్డి, కార్యదర్శులుగా అనుమంతుల వెంకటయ్య, సుదర్శన్‌లు ఎన్నికై నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement