నిధులను సక్రమంగా వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నిధులను సక్రమంగా వినియోగించుకోవాలి

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

భువనగిరి: పీఎంశ్రీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని డీఈఓ భిక్షపతి కోరారు. బుధవారం భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలో గల జిల్లాపరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రాప్‌ బాక్స్‌ పూర్తి చేయడంతో పాటు ఆధార్‌, అపార్‌ పనుల పురోగతిని వేగవంతం చేయాలన్నారు. ప్రీ ప్రైమరీ బోధకులకు ఆయాలకు దసరాలోపు వేతనాలు చెల్లించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారులు శ్రీహరిఅయ్యంగార్‌, జానీ అప్ఘన్‌, పాఠ్యపుస్తకాల కో ఆర్డినేటర్‌ అంజయ్య, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement