యాదగిరిగుట్ట రూరల్: రైతులకు సాగు నీటి ఇబ్బందులను తొలగించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామ పరిధిలో ఉన్న కాన్లకుంట చెరువుకు నీటిని అందించే ఫీడర్ కెనాల్ను బుధవారం పరిశీలించారు. ఫీడర్ కెనాల్ దెబ్బతినడంతో నీరు చెరువుల్లోకి వెళ్లకుండా వృథాగా పోతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఈ ఫీడర్కెనాల్ పునరుద్ధరణ చేయడానికి డీఎమ్ఎఫ్టీ నిధుల నుంచి రూ.125.45 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గణేష్ నాయక్, సర్పంచ్లు చిన్నం మమత శ్రీనివాస్, ఆరె రమేష్ గౌడ్, సోకం అనిత, ఎల్లేష్, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, ఆరె మల్లేష్ గౌడ్, కొక్కలకొండ అరుణ, పీస్ సంస్థ డైరెక్టర్ నిమయ్య, రైతులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట: వృత్తి నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న శిక్షణ, విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ విధానం, శిక్షణ అనంతరం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ కోర్సులు, బోధన, ప్రాక్టికల్ శిక్షణ తదితర అంశాలను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు, కమిషనర్ బి.శ్రీనివాస్, తహసీల్దార్ గణేష్ నాయక్ తదితరులున్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


