ఫ విజ్ఞాన్స్ యూనివర్సిటీ అసిస్టెంట్
ప్రొఫెసర్‌కు రూ.5లక్షల నగదు పురస్కారం
భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారకార్థం నిర్వహించిన ‘డేర్ టూ డ్రీమ్ ఇన్నోవేషన్ 5.0 ’ జాతీయస్థాయి పోటీల్లో భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజిక్స్) డాక్టర్ సాయిశివ పాల్గొని అంతరిక్ష వ్యర్థాల వల్ల ఉపగ్రహాలకు కలిగే ముప్పును లేజర్ సాంకేతికత ద్వారా ఎలా తొలగించవచ్చనే పరిశోధనను ప్రతిపాదించి వ్యక్తిగత విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచి రూ.5 లక్షల నగదు పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వేలాది మంది పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ పోటీల్లో సాయిశివ ప్రతిపాదించిన పరిశోధన ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలు శాటిలైట్ వ్యవస్థకు పెనుముప్పుగా మారాయన్నారు. ఈ సమస్యకు ‘లేజర్ బేస్డ్ స్పేస్ డెబ్రిస్ రిమూవల్’ అనే నూతన విధానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఈ విధానంలో భూమి నుంచి లేదా కక్ష్యలోని ఫ్లాట్‌ఫారంల నుంచి లేజర్ కిరణాలను పంపి వ్యర్థాల వేగాన్ని నియంత్రించి వాటిని భూవాతావరణంలోకి పంపించి మండిపోయేలా చేయవచ్చన్నారు. మంగళవారం సాయిశివను యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్‌రావు, ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు తదితరులు అభినందించారు.


