పంట వ్యర్థాలు.. సహజ పోషకాలు | - | Sakshi
Sakshi News home page

పంట వ్యర్థాలు.. సహజ పోషకాలు

Apr 8 2026 6:56 AM | Updated on Apr 8 2026 6:56 AM

భూమి సారవంతంగా ఉండేలా చూసుకోవాలి

త్రిపురారం : వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టి కాల్చివేస్తుంటారు. దీంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. పంట వ్యర్థాలకు నిప్పంటించడంతో నేలలో ఉండి పంటలకు మేలు చేసే కీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తాయి. రైతులు అలా చేయకుండా పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నితే భూసారం పెరిగి పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

● పంట వ్యర్థాలను కాల్చితే భూసారం దెబ్బతింటుంది. నేలలో తేమను కలిగి ఉండే మట్టి తన సహజ గుణాన్ని కోల్పోతుంది.

● నేలల్లో సహజ సిద్ధంగా ఉండే సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు నశిస్తాయి.

● నత్రజని లాంటి పోషక పదార్థాలు నశిస్తాయి.

● కొన్నాళ్లకు భూసారం తగ్గిపోవడంతో పాటు నేల పంటల సాగుకు పనికిరాకుండా పోతుంది.

● వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే దట్టమైన పొగతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.

● మంటలు పెద్దగా పెట్టడంతో ఇతర పొలాలు, వ్యవసాయ వస్తువులకు నష్టం వాటిల్లుతుంది.

● వానపాములు వృద్ధి చెంది భూమికి మేలు చేస్తాయి.

భూమిలో కలియ దున్నడం వల్ల కలిగే లాభాలు

సాధారణంగా వరి కోతల తర్వాత గడ్డి, వరి కొయ్యలు, ఇతర పంటల్లో అడుగున ఉండే మొక్కల భాగాలు పొలంలోనే ఉంటాయి. వాటిని కాల్చకుండా భూమిలో కలియ దున్నడం వల్ల అవి మట్టిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుతుతుంది. నత్రజని, భాస్వరం, సూక్ష్మపోషకాలు వృద్ధి చెందుతాయి. దీంతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. రైతులు పొలాల్లో పంటల వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్ధాలు కాల్చడం వల్ల వాతావరణంలోకి కార్బన్‌ డైయాకై ్సడ్‌, మిథేన్‌, కార్బన్‌ మోనాక్‌పైడ్‌ ఇతర విష వాయువులు విడుదలవుతాయి.

గడ్డి, కొయ్యలను ఇలా చేయాలి.

● పొలాన్ని రోటావేటర్‌తో కలియ దున్నాలి. దీంతో వరి కొయ్యలు చిన్నచిన్న ముక్కలుగా మారుతాయి.

● దుక్కికి నీళ్లు పెట్టి ఎకరాకు 100 గ్రాముల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ వేసి 15 నుంచి 20 రోజులు పొలాన్ని నానబెట్టాలి.

● వరి కొయ్యలు పూర్తిగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారే విధంగా సమయం ఇవ్వాలి.

పంటల సాగులో దిగుబడులు పెరగాలంటే ప్రతి రైతు నేలను కాపాడుకోవాలి. వ్యర్థాలను కాల్చడం వల్ల భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి. చీడపీడల ఉధృతి సైతం పెరుగుతుంది. నేల పరిరక్షణతో పాటు వాతావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

– చంద్రశేఖర్‌, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌,

కృషి విజ్ఞాన కేంద్రం, కంపాసాగర్‌

పొలాల్లో పంట వ్యర్థాలను

తగులబెడుతున్న రైతులు

ఇలా చేస్తే సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు

నశించి భూసారం తగ్గే అవకాశం

కలియ దున్నితేనే బహుళ ప్రయోజనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement