ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలి

Apr 8 2026 6:56 AM | Updated on Apr 8 2026 6:56 AM

భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌

శాలిగౌరారం : ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. శాలిగౌరారం మండల కేంద్రంతో పాటు పెర్కకొండారం, భైరవునిబండ గ్రామాల్లో మంగళవారం నల్లగొండ కలెక్టర్‌ బి. చంద్రరశేఖర్‌తో కలిసి వారు పర్యటించారు. ఈ సందర్భంగా పెర్కకొండారంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.7 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎంపీ నిధులు రూ.4 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను, శాలిగౌరారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా భైరవునిబండ గ్రామంలో రూ.8 కోట్లతో నూతనంగా నిర్మించనున్న భైరవునిబండ–నక్కలపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించనున్న గ్రామ సంఘ బంధం భవనం నిర్మాణ పనులతో పాటు రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభలో వారు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ జరిపి వాటిని పూర్తిచేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాలలో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ గిరిధర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాదూరి శంకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నరిగె నర్సింహ, తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, ఏపీఎం శంకరయ్య, పీఏసీఎస్‌ సీఈఓ ఆంజనేయులు, పీసీసీ నాయకుడు నూక కిరణ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు దండ అశోక్‌రెడ్డి, తాళ్లూరి మురళి, యంగళి రామకృష్ణగౌడ్‌, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement