
కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హైవే అథారిటీ, రోడ్డు భధ్రత అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దండుమల్కాపురం గ్రామంలోకి వెళ్లే కూడలి, బొర్రోల్లగూడెం వద్ద ఉన్న కూడలి విస్తరించేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జాతీయ రహదారిపై ఉన్న కై తాపురం, పంతంగి గ్రామాల కూడళ్ల వద్ద తాజాగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. హైవేపై ఉన్న బ్లాక్‌స్పాట్లలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మండలంలోని ధర్మాజిగూడెం స్టేజి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.