
గమనించకపోతే ప్రమాదమే..
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జి రాళ్లుతేలి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో బ్రిడ్జిలోని కొంత భాగం ధ్వంసమైంది. భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ మండలాల వారు ఈ దారిలో రాకపోకలు సాగిస్తుంటారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు అధికారులు అక్కడ రాళ్లను అడ్డంగా పెట్టారు. రాత్రి వేళ్లల్లో రాళ్లను గమనించకపోతే వాహనదారులు మూసీలో పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ధ్వంసమైన జూలూరు, రుద్రవెల్లి బ్రిడ్జి