
నిధుల విడుదల చేయాలని సీఎంను కోరిన ఎమ్మెల్యేలు
సాక్షి, యాదాద్రి: ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. గంధమల్ల రిజర్వాయర్ భూసేకరణకు రూ.50 కోట్లు కావాలని కోరినట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. ఈమేరకు నిధులు విడుదల చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మూసీ నదిపై రుద్రవెల్లి– జూలూరు మధ్యన బ్రిడ్జి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నిధులు రూ. 27.50 కోట్లు విడుదల చేస్తానని సీఎం చెప్పారని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.