
జీఎస్టీ తగ్గినా..
దీపావళికి కొనుగోళ్లు పెరగొచ్చు
కొనుగోళ్లు పెరగలే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గించినా వాహన కొనుగోలుదారుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చి 25 రోజులు గడిచినా వాహన కొనుగోళ్లలో పెద్దగా తేడా లేదు. ఉమ్మడి జిల్లాలో జీఎస్‌టీ తగ్గక ముందు 20 రోజుల్లో కొనుగోలు చేసిన వాహనాల సంఖ్య, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన తరువాత 20 రోజుల్లో జరిగిన వాహన కొనుగోళ్లను పోల్చితే కాస్త తగ్గాయి
28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ
కేంద్ర ప్రభుత్వం వాహనాలపై ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో దసరాకు పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేస్తారని అంతా భావించారు. కార్ల కేటగిరీని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ధరలు తగ్గాయి. ఇక బైక్‌లపైనా రూ.4 వేల నుంచి మొదలుకొని బైక్‌ను బట్టి రూ.15 వేల వరకు ధర తగ్గింది. అయినా కూడా వాహన కొనుగోళ్లపై ప్రజలు ధర తగ్గింపు విషయంలో ఆసక్తి కనబరచలేదు.
జీఎస్‌టీ తగ్గడానికి
ముందే అధికంగా కొనుగోళ్లు
చాలా మంది దసరాకు ముందే వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్‌లు కట్టి తెప్పించుకున్నారు. దసరా పండుగకు వాహనాలు దొరక్కపోతే ఇబ్బంది అవుతుందని, చాలా మంది రెండు నెలల ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని తగ్గించింది. అది కూడా బుక్ చేసుకున్న వాహనాలకు వర్తించింది. అయితే జీఎస్టీ తగ్గించిన తరువాత ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు పుంజుకోలేదు. జీఎస్‌టీ కంటే ముందు 20 రోజుల్లో కొనుగోలు చేసిన వాహనాల కంటే జీఎస్‌టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన తరువాత కొనుగోలు చేసిన వాహనాల సంఖ్య తక్కువగానే ఉంది.
ఉమ్మడి జిల్లాలో పుంజుకోని వాహనాల కొనుగోలు
ఫ జీఎస్టీ తగ్గుదలకు ముందు, తరువాత విక్రయాల్లో కనిపించని తేడా
ఫ దసరాకు ముందే బుక్ చేసుకున్న వినియోగదారులు
ఫ ధరలు తగ్గినా కనిపించని ఉత్సాహం
ఉమ్మడి జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు ఇలా..
జీఎస్టీ తగ్గింపునకు ముందు..
జిల్లా కార్లు బైకులు మిగతావి
యాదాద్రి 81 546 218
నల్లగొండ 64 505 473
సూర్యాపేట 45 386 316
జీఎస్టీ తగ్గింపు తరువాత..
జిల్లా కార్లు బైకులు మిగతావి
యాదాద్రి 54 451 181
నల్లగొండ 60 528 450
సూర్యాపేట 37 345 285
సాధారణంగా ఎక్కువ మంది వాహనాలను దసరాకు కొనుగోలు చేస్తారు. దసరా సమయంలో కొనుగోలు చేసే ప్లాన్‌లేని వారు దీపావళికై నా కొనుగోలు చేయాలన్న ఆలోచనతో ఉంటారు. అయితే జీఎస్‌టీ తగ్గి వాహనాల ధరలు తగ్గినందున ఈ దీపావళికి ఎక్కువ వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అయితే వాహన కంపెనీలు ఆశించిన మేర కొనుగోళ్లు ఉంటాయా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. – వాణి,
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, నల్లగొండ

జీఎస్టీ తగ్గినా..