
టెక్స్‌టైల్ పార్కులో దేవాలయాల కండువాల తయారీ
చౌటుప్పల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సరఫరా చేసేందుకు గాను చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని అపెరల్ టెక్స్‌టైల్ పార్కులో మర మగ్గాలపై టీజీఎస్‌కో ద్వారా కండువాలు తయారు చేయిస్తున్నామని చేనేత, జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్‌వీ రావు తెలిపారు. మంగళవారం ఆయన టెక్స్‌టైల్ పార్కుని సందర్శించి అక్కడ తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. కళాకారిణి రిజిమ కళాకండాలతో పాటు కళాకారుడు శ్రావణ్ వెదురుతో తయారుచేసిన ఉత్పత్తులు, హస్త కళాకారుడు కె. కృష్ణమూర్తి ప్రాచీణ బాతిక్, స్క్రీన్, బ్లాక్, టై అండ్ డై పద్ధతులను నవీకరించి తయారుచేసిన వస్త్రాలను పరీశీలించారు. అపెరల్ టెక్స్‌టైల్ పార్కు నిర్వహణ బాధ్యతలను టీజీఐఐసీకి అప్పగించాలని కోరుతూ పార్కు కమిటీ అధ్యక్షుడు ఎంకెడీ ప్రసాద్ ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఐఐహెచ్‌టీ సహాయ ప్రిన్సిపాల్ కుమార్, సలహాదారు కోప్రసాచారి, చేనేత ఏడీ శ్రీనివాసరావు, అభివృద్ధి అధికారి బాలమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
చేనేత, జౌళి శాఖ
జాయింట్ డైరెక్టర్ ఎన్‌వీ రావు