
మద్యం షాపులకు ఎమ్మెల్యే నిబంధనలు
ఫ గతంలో మాదిరిగా దుకాణాలునడుపుతామంటే కుదరదిక
ఫ జనం మేలుకోరి నిర్ణయం : రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వ్యక్తులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొత్త రూల్ పెట్టారు. గతంలో మాదిరిగా వైన్స్‌లు నడుపుతామంటే కుదరదని స్పష్టం చేశారు. షాపులు దక్కించుకున్నవారు ఊరి బయటనే ఏర్పాటు చేసుకోవాలని, సిట్టింగ్ రూంలు ఉండవద్దన్నారు. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేయొద్దన్నారు. సాయంత్రం 4నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాలన్నారు. షరతులు ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదని, జనం మేలుకోరి నిర్ణయం తీసుకున్నానని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే సూచనలకు సంబంధించి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం నల్లగొండలోని ఎకై ్సజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాగా ఇప్పటికే గ్రామాల్లో బెల్టు షాపులు నివారణకు కృషి చేస్తుండగా.. తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.