రైతుల కల సాకారం చేసిన దాత | - | Sakshi
Sakshi News home page

రైతుల కల సాకారం చేసిన దాత

Oct 16 2025 4:51 AM | Updated on Oct 16 2025 4:51 AM

రైతుల

రైతుల కల సాకారం చేసిన దాత

ఇన్నాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు గ్రామాభివృద్ధికి నావంతు తోడ్పాటు

పొలాలకు వెళ్లేందుకు రోడ్డు లేక 45 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మా గ్రామస్తుడు శేఖర్‌గౌడ్‌ రైతుల ఇబ్బందులు చూసి తన సొంత డబ్బులతో 4 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేయించాడు. శేఖర్‌గౌడ్‌కు రైతులంతా రుణపడి ఉంటాం. –యాదిరెడ్డి, రైతు, గూడూరు

గ్రామంపై ఉన్న మమకారంతో అభివృద్ధికి నావంతు తో డ్పాటునందిస్తున్న. పొలాల కు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రైతులు సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నా సొంత డబ్బులు రూ.2 కోట్లు వెచ్చించి నాలుగు కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేయించా. –తొర్పునూరి రాజశేఖర్‌గౌడ్‌,

రోడ్డు నిర్మాణ దాత, గూడూరు

బీబీనగర్‌: ఉన్నత హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోని ఈ రోజుల్లో రైతుల పడుతున్న ఇబ్బందులను చూసి వారి సమస్యను తీర్చేందుకు ముందుకువచ్చాడు ఓదాత. తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చు చేసి పంట పొలాలకు చక్కటి రోడ్డు నిర్మింపజేయించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. గూడూరుకు చెందిన తొర్పునూరి రాజశేఖర్‌గౌడ్‌.

4 కి.మీ మేర రోడ్డు నిర్మాణం

బీబీనగర్‌ మండలం గూడూరు శివారు నుంచి భువనగిరి మండలం తాజ్‌పూర్‌కు వెళ్లే పానాదిబాట గుండా 4 కి.మీ మేర గూడూరుకు చెందిన 25 మందికి పైగా రైతుల భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డు ప్రకారం నక్షలో 33 ఫీట్ల విస్తీర్ణం రోడ్డు ఉన్నప్పటికీ ఈబాట కోసం రైతులు 45 ఏళ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. గ్రామాభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న తొర్పూనూరి రాజశేఖర్‌గౌడ్‌ దృష్టికి రైతులు సమస్యను తీసుకెళ్లగా 4 కి.మీ మేర 30 ఫీట్ల విస్తీర్ణంతో సీసీ రోడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.

పది రోజుల్లోనే పూర్తి

రోడ్డు కోసం రాజశేఖర్‌గౌడ్‌ రూ.2 కోట్లు ఖర్చు చేశా డు. నాణ్యమైన మెటీరియల్‌ వినియోగించి కేవలం పది రోజుల్లోనే రోడ్డు వేయించాడు. రోడ్డు కోసం రైతులు తమ భూముల్లో కొంత వదులుకున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ సమస్య తీరిందని రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ పంట పొలాల వద్దకు రహదారి కోసం సొంత నిధులు ఖర్చు

ఫ రూ.2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం

ఫ 45 ఏళ్లకు సమస్య పరిష్కారం

ఫ రైతులు, గ్రామస్తుల హర్షం

రైతుల కల సాకారం చేసిన దాత1
1/3

రైతుల కల సాకారం చేసిన దాత

రైతుల కల సాకారం చేసిన దాత2
2/3

రైతుల కల సాకారం చేసిన దాత

రైతుల కల సాకారం చేసిన దాత3
3/3

రైతుల కల సాకారం చేసిన దాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement