
రూ.కోట్లు ఖర్చు.. వినియోగిస్తే ఒట్టు
అప్‌గ్రేడ్ చేస్తేనే ప్రయోజనం
ప్రస్తుత సర్కార్ పరిశీలించాలి
దళారులకు అమ్ముకుంటున్నారు
మోటకొండూర్: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా, దళారీల నుంచి వారిని కాపాడాలన్న ఉద్దేశంతో మోటకొండూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినా ఫలితం లేకుండాపోయింది. ఏడేళ్లయినా అక్కడ క్రయవిక్రయాలు జరగడం లేదు. వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు.
ఇదీ పరిస్థితి
● మోటకొండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు జరగడం లేదు. ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో 2018లో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో సబ్ మార్కెట్ యార్డు నిర్మించారు. యార్డులో 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారులు మార్కెట్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉన్నా నిబంధనలు అమలు కావడం లేదు.
● పాత ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), గుండాల మండలాల పరిధిలోని పలు గ్రామాలను విడదీసి మోటకొండూర్ నూతన మండలం ఏర్పాటు చేశారు. కానీ, సగం గ్రామాలు ఆలేరు, మోత్కూరు మార్కెట్‌ల పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు మోటకొండూరుకు కాకుండా పూర్వపు మార్కెట్‌లకు వెళ్తున్నారు. గ్రామాలన్నింటినీ మోటకొండూరు సబ్ మార్కెట్ పరిధిలోకి తీసుకువచ్చి ఇక్కడే క్రయవిక్రయాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
అధికంగా సాగు విస్తీర్ణం ఇక్కడే..
జిల్లాలో అత్యధిక సాగు విస్తీర్ణం మోటకొండూర్ మండంలంలోనే ఉంది. ఇక్కడ 22,670 ఎకరాల సాగు భూమి, 11,617 మంది రైతులు ఉన్నారు. వా నాకాలం సీజన్‌లో పత్తి 10,800, వరి 10,500, ఇతర పంటలు 1,370 ఎకరాల్లో సాగయ్యాయి. స్థానికంగా మార్కెట్ యార్డు ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఇతర మండలాల మార్కెట్‌లకు వెళ్తున్నారు. మరికొందరు ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
వృథాగా మోటకొండూరు వ్యవసాయ సబ్ మార్కెట్
ఫ నిర్మించి ఏడేళ్లు గడిచినా
మొదలుకాని క్రయవిక్రయాలు
ఫ దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
ఫ కొనుగోళ్లు ఇక్కడే చేయాలని వేడుకోలు
మోటకొండూర్, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట మండలాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి మోటకొండూర్ సబ్ మార్కెట్ యార్డును అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఎమ్మెల్యే 2022లో సిఫారస్ చేశారు. అనుమతులు ఇచ్చే వేళ మునుగోడు ఉప ఎన్నిక రావడం, అనంతరం జనరల్ ఎలక్షన్లు కారణంగా అప్‌గ్రెడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదనకు కార్యరూపం తేవాలని రైతులు కోరుతున్నారు.
మార్కెట్ యార్డ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి గత ప్రభుత్వంలో ప్రతిపాదించారు. ప్రస్తుత సర్కార్ పరిశీలించాలి.అప్‌గేడ్ర్ చేయడం వల్ల మోటకొండూరుతో పాటు ఆలేరు, మోత్కుర్ మండలాల రైతులకు మేలు జరుగుతుంది. కొనుగోళ్లు జరగక పండించిన పంట దళారులకు చెందుతుంది.
–ఎగ్గిడి బాలయ్య, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్
సబ్‌మార్కెట్ యార్డులో గిడ్డంగులు నిర్మించినా ప్ర యోజనం లేదు. ధాన్యం, పత్తిని ఇంట్లో నిల్వ చేసుకునే పరిస్థితి లేక దళారులకు అమ్ముకుంటున్నారు. దీని ఆసరాగా తీసుకొని తక్కువ రేటుకు కొనుగోలు చే స్తున్నారు. సబ్‌మార్కెట్‌ను మార్కెట్ యార్డ్‌గా మార్చాలి. –గాదెగాని మాణిక్యం, సీపీఐ మండల కార్యదర్శి

రూ.కోట్లు ఖర్చు.. వినియోగిస్తే ఒట్టు

రూ.కోట్లు ఖర్చు.. వినియోగిస్తే ఒట్టు