
నివేదికలు ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : గనులు, క్వారీల మంజూరీకి పర్యావరణ అనుమతులు మంజూరు చేయడానికి రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (సియా)కు సంబంధించిన జిల్లా సర్వే నివేదిక సంకలన కమిటీ సమావేశం బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కమిటీ సభ్యులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నిర్దేశించిన గడువులోపు నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంటల సర్వే
రాజాపేట: మండలంలోని బొందుగుల గ్రామంలో బుధవారం జాతీయ గణాంక అధికారులు పంటల సర్వే నిర్వహించారు. వర్షాధార పంటలు, బోరుబావుల ద్వారా సేద్యం చేసే పంటల వివరాలు నమోదు చేసుకున్నారు. సర్వే ద్వారా దేశంలో పంటల విస్తీర్ణం, సాగు ఎగుమతి, దిగుమతుల వివరాలు తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అంజయ్య, రైతులు పాల్గొన్నారు.
బిల్ కలెక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశం
ఆలేరు: మున్సిపల్ సిబ్బంది కొందరు విధులకు గైర్హాజరు కావడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆగ్రహం వేశారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన ఆలేరు మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కొన్ని రోజులుగా బిల్‌కలెక్టర్ నాగేందర్ అనధికారికంగా సెలవులో ఉన్నట్టు అదనపు కలెక్టర్ గుర్తించారు. ఈ విషయమై ము న్సిపల్ మేనేజర్‌ను ప్రశ్నించగా అనారోగ్యం వల్ల విధులకు రావడం లేదని వివరణ ఇచ్చారు. అనుమతి తీసుకోకపోవడంతో సస్పెన్షన్‌కు ఆదేశించారని, ఈ మేరకు నివేదిక అందజేయనున్నట్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
నేత్రపర్వంగా
యాదగిరీశుడి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆగమశాస్త్రానుసారం నేత్రపర్వంగా చేపట్టారు. బుధవారం వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం వేడుక జరిపించారు. ఆ తరువాత బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చు కున్నారు. రాత్రి శ్రీస్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం గావించారు.

నివేదికలు ఇవ్వండి