
ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
బొమ్మలరామారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులకు సూచనలు చేశారు. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం భారం కావద్దన్న ఉద్దేశంతో సమభావన సంఘాల నుంచి రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. అంతకుముందు తహసీల్ధారు కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగకుండా చూడాలని, అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దారు శ్రీనివాసరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, డిప్యూటీ తహసీల్దార్ సునీల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ బైసు రాజేష్, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం, వెలుగు ఏపీఎం యాదగిరి, నాయకులు శ్రీరాములు నాయక్, రామిడి జంగారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు

ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి