
సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదు
రామన్నపేట: సీఎం, మంత్రులకు రాజకీయాలు తప్ప.. రైతుల బాధలు పట్టడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దళారులకు అమ్మి నష్టపోతున్నారన్నారు. మంత్రుల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారిందన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్ నాయకులు బందెల రాములు, వేమవరపు సుధీర్‌బాబు, గొరిగె నర్సింహ, బద్దుల ఉమారమేష్, సాల్వేరు అశోక్, ఎస్‌కే చాంద్, మిర్యాల మల్లేశం, జాడ సంతోష్, బొడ్డు అల్లయ్య, లవనం రాము, దండుగుల సమ్మయ్య, ఎండీ ఎజాజ్, ఆవుల శ్రీధర్, గర్దాసు విక్రం, రాస వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీశైలం, ఎండీ మోసబ్, సైదులు, ఎండీ అంజద్, బాబు, నరేష్, గణేష్, ఖలీం, యాదయ్య, లింగయ్య ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య