
25లోగా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ అభ్యసిస్తున్న 1, 3, 5 సెమిస్టర్లకు చెందిన విద్యార్థులు ఈ నెల 25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఎంజీ యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
పరిశోధనలే
సమాజానికి దిక్సూచి
ఫ ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: పరిశోధనలే సమాజానికి దిక్సూచి అని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఐక్యూ ఏసీ ఆధ్వర్యంలో 2028లో జరగనున్న మూడవ విడత నాక్ మూల్యాంకనంపై బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలన్నారు. నాక్ ఏ గ్రేడ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో గోపికృష్ణ, గోనారెడ్డి, అల్వాల రవి, మిరియాల రమేష్, కొప్పుల అంజిరెడ్డి, రేఖ, అన్నపూర్ణ, ఆకుల రవి, సుధారాణి, శ్రీదేవి, అరుణప్రియ పాల్గొన్నారు.