
భూ నిర్వాసితులకు రాచకొండలో భూములివ్వాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారంగా రాచకొండలోని భూములు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లో నిర్మించనున్న ట్రిపుల్‌ఆర్ జంక్షన్ ప్రాంతాన్ని బుధవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి సందర్శించారు. రీజినల్ రింగ్‌రోడ్డు కోసం గుర్తించిన పొలాలు, వెంచర్లను పరిశీలించారు. భూనిర్వాసితులను కలిసి వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివీస్, శ్రీని పరిశ్రమలను కాపాడేందుకు అలైన్‌మెంట్‌ను చౌటుప్పల్ ప్రాంతంలో 10కిలోమీటర్లు వంకర్లుగా మార్చారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తక్షణమే చౌటుప్పల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయకార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పల్లె శేఖర్‌రెడ్డి, బచ్చనగోని గాలయ్య, నిర్వాసితులు బోరెం ప్రకాష్‌రెడ్డి, వల్లూరి బోవయ్య, సందగళ్ల మల్లేష్, జాల శ్రీశైలం పాల్గొన్నారు.
భూనిర్వాసితుల మద్దతుకు
సీపీఐ ఉద్యమిస్తుంది
సంస్థాన్ నారాయణపురం: రీజినల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వారికి మద్దతుగా సీపీఐ ఉద్యమిస్తుందని ఆపార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తున్న దేవిరెడ్డిబంగ్లా, పుట్టపాక గ్రామాల్లో పర్యటించి పొలాలు పరిశీలించారు. ఉత్తర భాగం విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలుస్తామన్నారు. దక్షిణ భాగం భూనిర్వాసితులతో ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామెదర్‌రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు, నాయకులు తదితరులున్నారు.
ఫ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ
సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి